శ్రీరాంపూర్ ఇంచార్జ్ జీఎం ఎన్. సత్యనారాయణ
శ్రీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద సారలమ్మకు ప్రత్యేక పూజలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమ్మక్క సారలమ్మ జాతరను దిగ్విజయం చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఎన్. సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్దకు కంకవనం నుండి సారలమ్మ దేవతను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాల అధికారులను అభినందించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పుర ప్రజల పైన దేవతల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఉన్న సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకోవాలని కోరారు. ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, అరుణ దంపతులు ఈ వేడుకలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆలయ పూజారి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, ఇందారం ఓసీపీ పీవో ఏ. వెంకటేశ్వర రెడ్డి, ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, అధికారులు ఎస్. సురేందర్, మురళి, ఏఐటీయూసీ నాయకులు ముస్కే సమ్మయ్య, కొట్టే కిషన్ రావు, సేవ కార్యదర్శి కొట్టే జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



