నస్పూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశంలోని అత్యున్నత పదవుల నుంచి అన్ని రంగాల వరకు మహిళలు తమ సత్తా చాటుతున్నారని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. నస్పూర్ లోని గోదావరి ఫంక్షన్ హాల్లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలో మహిళా దినోత్సవంగా ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నామని జీఎం శ్రీనివాస్ తెలిపారు. సింగరేణిలోనూ మహిళలు అన్ని విభాగాల్లో అండర్ గ్రౌండ్ విధుల్లో రాణిస్తున్నారని చెప్పారు. పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించడంతో పాటు కనీస వసతుల కల్పనకు తగు చర్యలు
తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తారని ఉమారాణి పేర్కొన్నారు. నేడు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ కొన్ని విభాగాలను శాసిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ పై జరిపిన ఆపరేషన్ సింధూర్ కు మహిళలు నాయకత్వం వహించడం భారతీయులందరికీ గర్వకారణమని ఉమారాణి గుర్తు చేశారు. అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపికైన ఏజీఎం ఫైనాన్స్ సుమలత, వర్క్ షాప్ జనరల్ అసిస్టెంట్ పద్మను ఘనంగా సత్కరించారు. వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చిన్నారులు, సేవా సభ్యులు, సింగరేణి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.




కార్పొరేషన్ పరిధిలో సింగరేణి విస్తరించి ఉన్న డివిజన్లలోని పలు ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. పారిశుధ్యం, నీటి సరఫరా మెరుగుపరచాలని, విద్యుత్ దీపాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రెండో డివిజన్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నగర అభివృద్ధిలో సింగరేణి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు బండారి సుధాకర్, వేల్పుల రవీందర్, అగ్గు సాగర్, పత్తి పకృతి, బొడ్డు స్వప్న, నాయకులు తోట శ్రీనివాస్, మర్రి రాజమొగిలి, పత్తి వెంకటేష్, బొడ్డు తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, జీఎం కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.