నస్పూర్ మండల పాఠశాలల్లో విఎన్ఆర్ ఫౌండేషన్ చేయూత
నస్పూర్ మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విఎన్ఆర్ ఫౌండేషన్, అల్ఫోర్స్ జూనియర్ కాలేజీల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి సహకారంతో శుక్రవారం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విఎన్ఆర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటి పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో విఎన్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రేగళ్ల ఉపేందర్, కలవల శ్రీనివాస్, సంధినేని శ్రావణ్, గోపతి తిరుపతి పాల్గొన్నారు.





చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నవీన్ సూచించారు. పిల్లలకు చిన్నపాటి వస్తువులు, నాణేలు, ప్రమాదకరమైన ఆటవస్తువులను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏదైనా వస్తువు మింగినట్లు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.