కోల్ బెల్ట్ ప్రజలకు అందుబాటులోకి ఆధునిక వైద్యం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లో సోమవారం శ్రీ సన్ షైన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను చేరువ చేసే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాల గదులను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జగన్ మోహన్ రావు ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్ ను ఆసుపత్రి నిర్వాహకులు బోరిగం శ్రీనివాస్, వెంకటేష్ ప్రారంభించగా, పీడియాట్రీషియన్ సానా సుమలత ఓపీ సేవలను మొదలుపెట్టారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకుడు బోరిగం వెంకటేష్ తెలిపారు. సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఖాలీద్, సుదమల్ల హరికృష్ణ, రాచకొండ గోపాల్ రావు, తోట శ్రీనివాస్, శ్రీపతి శ్రీనివాస్, ఆసుపత్రి చైర్మన్ బోరిగం రాజారాం, ఐఎంఏ అధ్యక్షుడు రవిప్రసాద్, కోశాధికారి సంతోష్, కార్యదర్శి అనిల్, ఎంపీఈవో సీపతి బాబురావు, కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి తొగరు సుధాకర్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



