సోన్, ఆర్.కె న్యూస్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం సోన్ మండల కేంద్రంతో పాటు మాదాపూర్, పాక్ పట్ల, సిద్ధుల కుంట, జాప్రాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని మండిపడ్డారు. గన్ని సంచులు లారీల కొరతతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని అన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి సర్పంచులు రాచకొండ సాగర్, రాజు రెడ్డి, సిహెచ్ గంగాధర్,బి నరేష్, మేకల మల్లేష్,చిట్టిమల్ల ఉదయ్, ముత్కపల్లి నరేష్ భువనగిరి నర్సయ్య, సుంచు సవీన్, పోశెట్టి, అమృత్, ప్రవీణ్ కళ్యాణ్, రామ్ రెడ్డి, గంగయ్య తదితరులున్నారు.
Daily Archives



