సొన్, ఆర్.కె న్యూస్: మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్ కు 20 రోజులు జైలు శిక్ష పడిందని ఎస్సై గోపి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఈనెల 6వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తుండగా అదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనము నడుపుతూ పట్టుబడినాడు. అతనిని మంగళవారం నిర్మల్ కోర్ట్ నందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ అతనికి 20 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని, ప్రతి వాహనదారుడు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, రూల్స్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై తెలిపారు.
7 July 2026
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల పోస్టుల డెమోలు వాయిదా
సొన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలలో ఈ నెల 10 న జరుపబడే పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్, పిజిటి, టీజీటీల, ఇతర పోస్టుల డెమోలను గురుకులాల సెక్రెటరీ హైదరాబాద్ వారి ఆదేశానుసారం వాయిదా వేయబడినది. సంస్థ ద్వారా నిర్ణయించబడిన తేదీని తదుపరి ప్రకటించబడునని నిర్మల్ జిల్లా డిసిఓ R . ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
సొన్, ఆర్.కె న్యూస్: మండలంలోని కడ్తాల్ గ్రామపంచాయతీలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ప్రక్రియను తహసీల్దార్ సంతోష్, గ్రామ సర్పంచ్ గుర్రం రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పట్లో నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలను పరిశీలించి, వాటికి అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతి అర్హుడు ఫారాన్ని సక్రమంగా నింపి ఎన్నికల సిబ్బందికి అందజేసి, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, జీపీఓ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.



