- జిల్లా ఉద్యానవన అధికారి బివి రమణ
సోన్, ఆర్.కె న్యూస్: రైతులకు నాణ్యమైన మొక్కలే అందించాలని జిల్లా ఉద్యానవన అధికారి బి.వి.రమణ అన్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలోని ప్రీ యూనిక్ కంపెనీ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో మొక్కల ఎదుగుదల తీరును పరిశీలించి, జన్యుపరమైన లోపాలున్న బలహీన మొక్కలను వెంటనే తొలగించాలని ఇంచార్జ్ శంకర్‌ను ఆదేశించారు. రైతులకు ఎప్పుడూ నాణ్యమైన మొక్కలే అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్. మౌనిక, నర్సరీ ఇంచార్జ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.



