సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఇట్టి సమావేశం సోన్ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి సిహెచ్ సుధాకర్ అధ్యక్షతన నిర్వహించబడినది. ఈ సమావేశంలో మండల అభివృద్ధి, గ్రామాల్లో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల సిరి, ఇందిరమ్మ హౌసింగ్, 16 ఆర్థిక సంఘం నిధులు నూతన ఉపాధి హామీ పథకం, గ్రామంలో వీధి కుక్కల, కోతుల బెడద నివారణ గురించి పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, గ్రామీణ మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సంబంధిత శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించగా, గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీఓ జ్యోతిలక్ష్మి , ఎం ఏ ఓ వినోద్ కుమార్, తాసిల్దార్ సంతోష్ కుమార్, డిటి జ్యోతి, పీహెచ్సీ వైద్యాధికారి విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Daily Archives



