ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావుకు వినతిపత్రం సమర్పించిన అభ్యర్థులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ఇంటర్నల్) రాత పరీక్షను తక్షణమే నిర్వహించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ అభ్యర్థులు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. అర్హత కలిగిన ఉద్యోగుల ఉద్యోగోన్నతి, న్యాయమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి జాప్యం లేకుండా పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అభ్యర్థులు తెలిపారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడ శ్రీకాంత్, బానోతు కిషన్, నాగిరెడ్డి రాజు, రామకృష్ణ, నెహ్రూ, భరత్ రెడ్డి, కన్నం అశోక్ పాల్గొన్నారు.



