శ్రీరాంపూర్ అధికారులతో సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు సమీక్ష
నస్పూర్, ఆర్. కె న్యూస్: ఈ ఆర్థిక సంవత్సరం శ్రీరాంపూర్ ఏరియాకు కంపెనీ నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం 64 లక్షల 30 వేల టన్నులను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలి” అని సింగరేణి డైరెక్టర్ (పీపీ) కే. వెంకటేశ్వర్లు ఆదేశించారు. శ్రీరాంపూర్ ఏరియా పర్యటనలో భాగంగా బుధవారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని గనుల ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు, మేనేజర్లు, వివిధ విభాగాల ఇంజనీర్లతో కలిసి గనుల వారీగా ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను పరిశీలించారు. సంస్థ వార్షిక లక్ష్యాల సాధనలో శ్రీరాంపూర్ ఏరియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భూగర్భ, ఉపరితల గనుల్లో ఉత్పత్తి వేగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని డైరెక్టర్ సూచించారు. గని పని ప్రదేశాల ప్లాన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించారు. గనుల నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఆటంకం కలగకుండా అవసరమైన యంత్రాలు, విడిభాగాలు, పనిముట్లను సకాలంలో సమకూర్చాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్పత్తిని పరుగులు పెట్టించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్వో టు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, ఏజీఎంలు సుమలత, ఆనంద్ కుమార్, ఐకే ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్ఆర్పీ ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఏజెంట్లు ఎన్. శ్రీధర్, రవికుమార్, డీజీఎంలు విజయ్ కుమార్, రాజన్న, ఏరియా పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, వివిధ గనుల మేనేజర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.




ఉత్పత్తితో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం హర్షణీయమన్నారు. నా 35 ఏళ్ల సింగరేణి ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో హోదాల్లో పనిచేసి డైరెక్టర్ స్థాయికి ఎదిగినా, ఒక్కసారైనా శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే అవకాశం రాకపోవడమే నా సర్వీసులో మిగిలిపోయిన తీరని కోరిక అని అన్నారు. దేశంలోనే అత్యధిక ఉత్పత్తి వ్యయం సింగరేణిలోనే ఉందని, ధర తగ్గిస్తేనే వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని డైరెక్టర్ పేర్కొన్నారు. రైల్వే నాలుగో లైన్ నిర్మాణం పూర్తయితే దేశంలో ఎక్కడి నుంచైనా బొగ్గు రవాణా సులభతరం అవుతుందని, ఇది సంస్థకు మరింత పోటీని తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. భూగర్భ గనుల్లో నష్టాలు రాకుండా యంత్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోవాలని కోరారు. సంస్థలో యువ ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, వారు గైర్హాజరు కాకుండా విధులు నిర్వర్తిస్తూ జీరో హార్మ్ లక్ష్యంతో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. బొగ్గుతో పాటు సంస్థ ఇతర వ్యాపారాలపై దృష్టి సారించిందని, కర్ణాటకలో బంగారు గనుల అన్వేషణ చేపడుతోందని తెలిపారు. ఒక దశలో తీవ్ర నష్టాల కారణంగా మూసివేత అంచున చేరిన ఎస్ఆర్పీ 1 గనిని కార్మికులు, సంఘాలు ఐక్యంగా శ్రమించి లాభాల బాట పట్టించారని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కొనియాడారు. అనంతరం శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ఉత్పత్తి, రక్షణ విభాగాల్లో ఎస్ఆర్పీ 1 గని శ్రీరాంపూర్ ఏరియాకే గర్వకారణమని పేర్కొన్నారు. 2018లోనే ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి మిగిలిన గనులకు ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ వేడుకల్లో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్ర రావు, ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం వెంకట్ రమణ, విశ్రాంత సీజీఎం సుగుణాకర్ రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు, సీఎంఓఏఐ అపెక్స్ కౌన్సిల్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, గని ఏజెంట్ రవికుమార్, మేనేజర్ ఆత్మారాం సహానీ, అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు.