ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య..
ఎస్ఆర్పీ-3, ఎస్ఆర్పీ-1 గనుల్లో 465 మంది చేరిక ఎస్ఆర్పీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: అగ్రిమెంట్లు చేయించేది మనమే.. వాటిని అమలు చేయించే బాధ్యత కూడా మనదే. కుదిరిన ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా కార్మికుల న్యాయమైన హక్కులన్నీ అమలయ్యే వరకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం చేస్తుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని
ఎస్ఆర్పీ-3 గనిలో 309 మంది, ఎస్ఆర్పీ-1 గనిలో 156 మంది మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. మంగళవారం మురళీ చౌదరి, దాడి రాజయ్యల అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ ఎస్కే బాజీ సైదా, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ మోత్కూరి కొమురయ్యలు కార్మికులకు కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్‌లు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ చేపట్టిన సేవ్ సింగరేణి జాతా, హెడ్ ఆఫీస్ ముట్టడి, సమ్మె నోటీసు వంటి ఉద్యమాల వల్లే సమ్మె లేకుండానే ఆర్ఎల్సీ వద్ద 24 ప్రధాన డిమాండ్లపై ఒప్పందం సాధించామన్నారు. సింగరేణి భవిష్యత్తు యువ కార్మికులపైనే ఆధారపడి ఉందని, వారికి యూనియన్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. సంస్థ విస్తరణకు, యువత ఉద్యోగాల కోసం వేలం ప్రక్రియలో యాజమాన్యం చురుగ్గా పాల్గొని కొత్త గనులను దక్కించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, అడ్డు శ్రీనివాస్, సురేష్, జిల్లా కార్యదర్శి అప్రోజ్ ఖాన్, మీడియా అధికార ప్రతినిధి రాజ్ కుమార్, ఎస్ఆర్పీ-3 అసిస్టెంట్ పిట్ సెక్రెటరీలు అంబాల రవి, కారుకూరి నగేష్, వైస్ ప్రెసిడెంట్ తౌటం మల్లేష్, ఎస్సార్పీ-1 అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ పరశురాం తదితరులు పాల్గొన్నారు.



