‘చలో పెద్దపల్లి’ కరపత్రాలను ఆవిష్కరించిన బీఎస్పీ నాయకులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ ఆస్పిరెంట్ అకాడమీలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 ఇన్ఛార్జ్ వర్కిల్ల మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి వర్కిల్ల మల్లేష్ మాట్లాడుతూ… బహుజనుల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తదుపరి డిసెంబర్ 6న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లిలో నిర్వహించనున్న సభకు సంబంధించిన ‘చలో పెద్దపల్లి’ కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జులు కాదాసి రవీందర్, బాల కళ్యాణ్ పంజా, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగాం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు ఆయిల్ల లక్ష్మణ్, నాయకులు కొల్లూరి సురేష్, చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




శనివారం మంచిర్యాల ప్రాజెక్ట్ పరిధిలోని రాంనగర్ సెక్టార్ ముస్లిం బస్తీ–1 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్వైజర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ స్వరూప లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, ప్రాథమిక విద్య ఎంతో అవసరమని తెలిపారు. ఆరు నెలల వయస్సు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు తగిన అనుబంధ ఆహారాన్ని అందించడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. చిన్న వయస్సు నుంచే పిల్లలలో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు అక్షరాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కాంతకృష్ణ, ఆయా మంజుల, తల్లులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.