వైభవంగా దసరా శరన్నవరాత్రులు

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5 గని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శరన్నవరాత్రుల్లో భాగంగా ఆర్కే 5(బి) సెక్షన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి, సంస్థ డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అన్నదాన కార్యక్రమంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉద్యోగులు, అధికారులు కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శనివారం నాడు గని ప్రాంగణంలోని మైసమ్మ ఆలయంలో శాంతి హోమం, లలిత పారాయణం నిర్వహించనున్నట్లు గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఆర్కే 5,6 గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి, అన్ని గనుల ఎజెంట్లు, మేనేజర్ లు, గని సంక్షేమాధికారి రణదీప్, అధికారులు, పలు కార్మిక సంఘాల ముఖ్య నాయకులు, పిట్ సెక్రటరీలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment