ఉద్యోగులు, అధికారుల సంక్షేమానికి ప్రాధాన్యం

– సింగరేణి డైరెక్టర్లు ఎన్. బలరాం, డి. సత్యనారాయణ రావు
– విజేతలకు బహుమతులు ప్రధానం
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి సంస్థ ఉద్యోగులు, అధికారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్, పా) ఎన్. బలరాం, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావులు అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ బంగ్లా ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 28 అధికారుల క్లబ్ సభ్యుల షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు  విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులు ఒకే  చోట చేరి వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడం సంతోషకరమని, క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కార్పొరేట్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్ జక్కం రమేష్, ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు  రాధా కుమారి, అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్, క్రీడల కన్వీనర్ డాక్టర్ రమేష్ బాబు, కో – కన్వీనర్ తిరుపతి, అన్ని ఏరియాల అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment