నైని బొగ్గు బ్లాక్ టెండర్లలో అక్రమాలపై టీబీజీకేఎస్ ధర్నా

  • సీఎం బంధువులకు కాంట్రాక్టుల కట్టబెట్టడంపై ఆగ్రహం
  • శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముట్టడి

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ పరిధిలోని నైని బొగ్గు బ్లాక్ కాంట్రాక్టు కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ బుధవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జీఎం మునిగంటి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి అక్రమంగా టెండర్లు కేటాయించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచిపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు రాష్ట్ర సంపదను పంచుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా జరిగిన టెండర్ల ప్రక్రియను మార్చి, ప్రస్తుతం సైట్ విజిట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల శ్రీరాంపూర్ ఓసి-2 ఎక్స్టెన్షన్, ఇందారం ఓసి ప్రాజెక్టుల ఓబీ పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిందని ఆరోపించారు. గతంలో ఓబీ కాంట్రాక్టర్లకు సింగరేణి సంస్థే డీజిల్ సరఫరా చేసి లాభాలు పొందేదని, ఇప్పుడు ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించి సంస్థకు నష్టం చేకూరుస్తున్నారని నేతలు పేర్కొన్నారు. సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ క్రీడలు నిర్వహించిన ముఖ్యమంత్రి, సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. గతేడాది మార్చి నుండి మెడికల్ బోర్డు నిర్వహించకుండా కారుణ్య నియామకాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కార్మికులు ఈ అన్యాయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ నడిపెల్లి విజిత్ కుమార్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు బండి బండి రమేష్, బిఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య, టీబీజీకేఎస్ నాయకులు పానుగంటి సత్తయ్య, అన్వేష్ రెడ్డి, ఎండి లాల, గడ్డం వెంకట్ రెడ్డి, గడ్డం మైపాల్ రెడ్డి, గొర్ల సంతోష్, ఉత్తేజి రెడ్డి, తొంగల రమేష్, పిట్ సెక్రటరీలు గడ్డం మల్లయ్య, జైపాల్ రెడ్డి, కురుమ వికాస్, సురేందర్ రెడ్డి, చిప్ప రమేష్, రాజిరెడ్డి, తిరుపతి రావు, సముద్రాల అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment