- కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఐదో డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరెబెల్లి రఘునాథ్ సూచనలు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు ఆదివారం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, స్థానిక అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు అభ్యర్థి మిట్టపల్లి మొగిలి, సీనియర్ నాయకుడు గరిగల శ్రీను, బీజేవైఎం నాయకులు మారేడుగొండ రనదీప్, బండారి సంపత్, బూత్ అధ్యక్షురాలు సంగీత, పబ్బ మధు తోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








