కాంగ్రెస్‌ గెలుపుతోనే కార్పొరేషన్‌ అభివృద్ధి

33వ డివిజన్‌లో అభ్యర్థి కుమారస్వామి తరఫున కొక్కిరాల సురేఖ ప్రచారం

నస్పూర్, ఆర్.కె న్యూస్: కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమవుతుందని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆమె 33వ డివిజన్‌లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి ఎంబడి కుమారస్వామిని హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక సమస్యల పరిష్కారం, నగర సుందరీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సురేఖ వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment