ఎన్ పీ ఎల్ విజేత సింగరేణి రాయల్ వారియర్స్ జట్టు

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్) సీజన్-1 క్రికెట్ పోటీల్లో సింగరేణి రాయల్ వారియర్స్ జట్టు విజయం సాధించింది. నస్పూర్ లోని న్యూనాగార్జునకాలనీ సింగరేణి ప్రాణహిత స్టేడియంలో ఈనెల 1న ఈ పోటీలు ప్రారంభం కాగా, ఆదివారం జరిగిన ఫైనల్ పోరుతో సీజన్-1 ముగిసింది. లీగ్ దశ నుండి అత్యంత ప్రతిభా కనబర్చి ఎలిఫెంట్ జట్టు, సింగరేణి రాయల్ వారియర్స్ జట్టు ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోటీ హోరా హోరీగా జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సింగరేణి రాయల్ వారియర్స్ జట్టు ఎలిఫెంట్ జట్టును నిర్దేశిత ఓవర్లలో 99 పరుగులకే పరిమితం చేయగా, లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన సింగరేణి వారియర్స్ జట్టు ఎక్కడ తడబడకుండా విజయతీరాలకు చేరింది. విజేతకు రూ.50 వేల నగదు, ట్రోఫీతో పాటు క్రీడాకారులకు వ్యక్తిగత షీల్డ్ లు అందజేశారు. రన్నర్ గా నిలిచిన ఎలిఫెంట్ జట్టుకు రూ.25 వేల నగదు, ట్రోఫీతో పాటు వ్యకిగత్త షీల్డ్ లు అందజేశారు. టోర్నీలో అత్యంత ప్రతిభా కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఎల్-1 ఆర్గనైజర్స్ గడ్డం సాయి, లడ్డ సాయి, ఎర్ర సంతోష్, సాగర్, జగన్, సోము, ధృవ సాయి, మంగేష్, డానియల్, వెంకటసాయి, సీనియర్ క్రీడా కారులు సంతోష్ నాయక్, కోడం రవి, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment