జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన జైపూర్ పవర్ ప్లాంట్ డీజీఎం కుమారుడు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: తెలంగాణ సీఎం కప్ 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో శనివారం నిర్వహించిన అండర్-15 బ్యాడ్మింటన్ పోటీల్లో డి. ధనుష్ స్వర్ణ పతకం సాధించాడు. జైపూర్ పవర్ ప్లాంట్ డీజీఎం డి. పంతులా కుమారుడైన ధనుష్ తన అద్భుత ప్రదర్శనతో జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ విజేతకు బంగారు పతకం అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో పతకం సాధించి ప్రతిభ చాటిన ధనుష్‌ను పవర్ ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు. క్రీడాకారుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే రాష్ట్రస్థాయి తెలంగాణ సీఎం కప్ పోటీలకు ధనుష్ అర్హత సాధించాడు.







