మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నస్పూర్ పద్మశాలి సంఘం ప్రతినిధులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్పొరేషన్ పరిధిలోని అన్ని వర్గాల సంక్షేమానికి, పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. మంగళవారం తన నివాసంలో నస్పూర్ పద్మశాలి సంఘం, మార్కండేయ దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ధర్ని మధుకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 9వ డివిజన్ కార్పొరేటర్ సురిమిళ్ల సౌమ్య వేణును సంఘం సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పట్టణ సమస్యల పరిష్కారానికి, కుల సంఘాల అభివృద్ధికి సహకరించాలని మేయర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య, మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, సభ్యులు మెండ వెంకన్న, చిప్ప రాజబాబు, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, సబ్బని భాస్కర్, కన్నం సాంబయ్య, కుందారపు రాములు, క్యాతం రాజేష్, కుసుమ శంకర్, పాటేటి శంకర్, ఆడేటి రాజన్న, కొండి శంకర్, కుంట రామన్న, అన్నం వెంకటేష్, ఆడేటి మోహన్, కటకం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.







