సింగరేణి రిటైర్డ్ అధికారి దైవాధీనం కన్నుమూత

ఘట్కేసర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సంతాప సభ

హైదరాబాద్, ఆర్.కె న్యూస్: సింగరేణి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దైవాధీనం చేసిన పోరాటం, ఆయన అందించిన సలహాలు అసోసియేషన్‌కు దిశానిర్దేశం చేశాయని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో సీనియర్ అండర్ మేనేజర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన పాక దైవాధీనం (75) ఈనెల 16న కొర్రెములలోని తన నివాసంలో అకాల మరణం చెందారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని సుప్రభాత్ టౌన్‌షిప్‌లో మంగళవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

​దైవాధీనం మరణం పట్ల వేణు మాధవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రిటైర్డ్ ఉద్యోగులందరినీ కలతకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని భార్యకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అందేలా అసోసియేషన్ తరఫున పూర్తి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వృద్ధాప్యంలోనూ విశ్రమించకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొనేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు మనోనిబ్బరం కోల్పోకుండా ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

​ఈ సంతాప సభలో సీనియర్ సిటిజన్ ఈదుల కొమరయ్య, అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.బీరయ్య, కొట్టే మల్లయ్య పాల్గొన్నారు. వీరితో పాటు ఎం.రాజా నర్సు, ఎస్.లక్ష్మీ నారాయణ, ఎ.ప్రభాకర్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాజా రెడ్డి, హరనాథ్, సత్యనారాయణ, సి.హెచ్.నర్సయ్య, వెంకటయ్య, టి.శ్రీనివాస్, సర్జిత్ సింగ్ తదితరులు హాజరై దైవాధీనంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment