సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమోఘం: మల్లెతుల రాజేంద్రపాణి

శ్రీరాంపూర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజ అభివృద్ధిలో మహిళలే కీలక శక్తులు అని సింగపూర్ మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్రపాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సీఏలను ఘనంగా సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళల కృషిని గుర్తించి ఈ గౌరవం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం పురోగమిస్తుందని రాజేంద్రపాణి పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలో మహిళా కార్యకర్తల పాత్ర కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ అధ్యక్షుడు గోపతి తిరుపతి, సతీష్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment