శ్రీరాంపూర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజ అభివృద్ధిలో మహిళలే కీలక శక్తులు అని సింగపూర్ మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్రపాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సీఏలను ఘనంగా సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళల కృషిని గుర్తించి ఈ గౌరవం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం పురోగమిస్తుందని రాజేంద్రపాణి పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలో మహిళా కార్యకర్తల పాత్ర కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ అధ్యక్షుడు గోపతి తిరుపతి, సతీష్ పాల్గొన్నారు.







