ఉద్యోగి దృఢంగా ఉంటేనే సంస్థ అభివృద్ధి సాధ్యం

  • శ్రీరాంపూర్‌ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • శ్రీరాంపూర్‌లో ఘనంగా సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రదానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగి ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విధుల్లో దృష్టి సారించి సంస్థ అభివృద్ధికి దోహదపడతారని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్‌లో 2025-26 సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. వివిధ క్రీడలు, కళా పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల ద్వారానే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రారంభమైన 17 రకాల ఇండోర్, అవుట్ డోర్ క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో రాణించిన శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు, కళాకారులను అభినందిస్తూ మునిగంటి శ్రీనివాస్ పురస్కారాలు అందజేశారు. శ్రీరాంపూర్ క్రీడాకారులకు సింగరేణి స్థాయిలోనే కాకుండా కోల్ ఇండియా, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. కంపెనీ స్థాయి పోటీలతో పాటు కోల్ ఇండియా విభాగాల్లో తిరుగులేని ప్రతిభ కనబరుస్తూ ఏరియాకు గర్వకారణంగా నిలిచారని వివరించారు. ఉద్యోగుల రిక్రియేషన్ కోసం సంస్థ స్టేడియాలు, క్లబ్బులు, ఈత కొలనులు, వ్యాయామశాలలు, పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసింది. ఇటీవల భారీ ఖర్చుతో ఓపెన్ జిమ్ లు కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, ఆర్.కె న్యూ టెక్ మేనేజర్ కూరపాటి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్, జీఏ హానరరీ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సెక్రటరీ చాట్ల అశోక్, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment