అపరిష్కృత సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ నెలలో సమ్మెకు పిలుపునిస్తాం

  • ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
  • శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో ఏఐటీయూసీ గేట్ మీటింగ్‌

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ నెలలో సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీహెచ్‌పీ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన 50 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిలిపివేసిన మెడికల్ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అపరిష్కృత సమస్యలపై అన్ని సంఘాలను కలుపుకొని పోరాడుతామని స్పష్టం చేశారు. కొత్త బొగ్గు గనులు ప్రారంభించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, పెర్క్స్‌పై ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 350 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, అఫ్రోజ్ ఖాన్, రవి, సాయి రాజు, గజ్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment