1, 6వ తరగతి విద్యార్థులకు పట్టాల ప్రదానం.. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: స్థానిక లక్ష్మీనగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం స్నాతకోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. 1వ తరగతి, 6వ తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులకు స్నాతకోత్సవ పత్రాలను అందజేశారు. ప్రిన్సిపాల్ అయూబ్ తదుపరి తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులను అభినందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వారి మానసిక వికాసానికి తోడ్పడుతుందని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతూ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజా రాణి, ఇన్చార్జ్ అనగమాట, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








