సోన్, ఆర్.కె న్యూస్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో రైతులకు బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ పుష్పలత మాట్లాడుతూ రైతులు పంట రుణాలు, భూమి తాకట్టు రుణాలు అతి తక్కువ వడ్డీకే తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకు నుండి పంట రుణాలు భూమి తాకట్టు రుణాలు తీసుకున్న రైతులు సంవత్సరం లోపల సకాలంలో చెల్లిస్తే తక్కువ వడ్డీ ఉంటుందని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లింపు ద్వారా రైతులకు జరుగు మేలు మొదలగు వాటిపై మాదాపూర్ బ్యాంక్ మేనేజర్ పుష్పలత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వినోద్ కుమార్ , ఏఈఓ అశోక్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీహిత్, రైతులు పాల్గొన్నారు.
18







