- మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
- హర్షిత్ ప్రిన్స్ కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎల్‌ఓసీ చెక్కు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆపదలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌కు చెందిన హర్షిత్ ప్రిన్స్‌కు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 7,00,000 రూపాయల ఎల్‌ఓసీ చెక్కును శనివారం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు. వైద్య ఖర్చుల భారం భరించలేని స్థితిలో ఉన్న తమకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవతో ఇంత పెద్ద మొత్తంలో సాయం అందడం పట్ల హర్షిత్ ప్రిన్స్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, సురేఖకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్య సాయం అందేలా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







