నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. సంఘం అభివృద్ధికి పాటుపడతామన్న అధ్యక్షుడు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పెరిక సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అంబడి కుమారస్వామి ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా తిప్పని రామన్న, ప్రధాన కార్యదర్శిగా రెంక రవిలు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా ఒడ్డె వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా అల్లం సతీష్, దొమ్మటి రాజేందర్, ప్రచార కార్యదర్శిగా దొమ్మటి కిరణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అంబడి కుమారస్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన సంఘం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ పెరిక సంఘం బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి తన వంతుగా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సంఘ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు బొడ్డు శంకర్, నాయకులు కార్కూరి చంద్రమౌళి, మేడం తిరుపతి, చుంచు రాజ్‌కిరణ్, అత్తి సరోజతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.







