తల్లిదండ్రులు జన్మనిస్తే బంగారు భవిష్యత్తును ఇచ్చేది ఉపాధ్యాయులే

  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తును ఇచ్చేది ఉపాధ్యాయులే అని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ సింగరేణి హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. గత విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి శ్రీరాంపూర్ పాఠశాల సంస్థకే ఆదర్శంగా నిలిచిందని జీఎం కొనియాడారు. ఉపాధ్యాయుల నిరంతర శ్రమ వల్లే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసిస్తూ, ప్రస్తుత ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment