ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను నిజం చేస్తోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారులు గుండా లక్ష్మి, రాయనర్సు దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో పేదల గృహ నిర్మాణాలకు పూర్తి సహకారం అందుతోందని తెలిపారు. తమ సొంతింటి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు, మేయర్ దర్ని మధుకర్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించి, వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడూరి విజయ్, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment