అలరించిన సింగరేణి సాంస్కృతిక పోటీలు

శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కంపెనీ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి: స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో డబ్ల్యూపీఎస్ & జీఏ సాంస్కృతిక పోటీలను ఆదివారం నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కో-ఆర్డినేటర్ సురేష్, జనరల్ కెప్టెన్ నరసయ్య పర్యవేక్షణలో, కల్చరల్ కెప్టెన్ మేడ పెద్దయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ పోటీలకు గోల్డ్ మెడలిస్ట్ ఫ్లూట్ రవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సాంస్కృతిక పోటీల్లో కళాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఫోక్ డాన్స్ గ్రూప్ విభాగంలో నీలాల శ్రీనివాస్ బృందం, కవ్వాలి విభాగంలో ఎస్కే తాజు బృందం, ఆర్కెస్ట్రా విభాగంలో మేడ పెద్దయ్య బృందం విజేతలుగా నిలిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. అలాగే వ్యక్తిగత విభాగాలలో.. జానపద గీతంలో శ్రీనివాస్, ఫ్లూట్ విభాగంలో రవి, కర్ణాటక సంగీతంలో ఎస్టీపీకి చెందిన శ్రీనిధి, గజల్ విభాగంలో తాజుద్దీన్‌తో పాటు శ్రీరాంపూర్ కమ్యూనికేషన్ సెల్ కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్ మాట్లాడుతూ.. విజేతలకు, పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. రానున్న నవంబర్ నెలలో మణుగూరు ఏరియాలో జరగనున్న కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా సత్తా చాటి పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కళాకారులంతా మరింత సాధన చేసి, కంపెనీ స్థాయిలోనే కాకుండా కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా రాణించాలని ఆకాంక్షించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment