కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

బతుకమ్మలతో వినూత్న నిరసన: అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట కార్మికులు బతుకమ్మలతో వినూత్న నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ప్రతి నెలా రావాల్సిన వేతనాలు, బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ వచ్చినా బిల్లులు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఎన్నికల హామీ ప్రకారం కార్మికులకు నెలకు రూ. 10,000 వేతనం అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న కార్మికులను 60 ఏళ్లు నిండాయనే సాకుతో తొలగించడం సరికాదన్నారు. తొలగించిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ. 2 లక్షలు చెల్లించాలని, కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ కరీమా, ఎండీ రఫియా, జిల్లా కోశాధికారి సవిత, ఉపాధ్యక్షులు మధునమ్మ, రబియా, సహాయ కార్యదర్శులు రమాదేవి, సరిత, జ్యోతి మరియు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment