వసుధ, వైష్ణవి దవాఖానల్లో ‘ఈహెచ్ఎస్’ సేవల పరిశీలన

  • జిల్లాలోని 16 ఆసుపత్రుల్లో 100 శాతం నగదు రహిత చికిత్సలు: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని వసుధ హాస్పిటల్, వైష్ణవి డెంటల్ హాస్పిటల్‌లలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరును టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ఈహెచ్ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ రాధిక, డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ, రాకేష్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై ఆరా తీయడంతో పాటు, అక్కడ చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు తమకు పథకం ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని 16 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ సేవలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వైద్య చికిత్సలతో పాటు శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘ కార్యదర్శి పొన్న మల్లయ్య, పారామెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుండేటి నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, ఈహెచ్ఎస్ కో-ఆర్డినేటర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment