జనసేన సమన్వయకర్త చుంచు రాజ్‌కిరణ్
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఎన్హెచ్ఎం ధర్నా
నస్పూర్, ఆర్.కె న్యూస్: వైద్యారోగ్య శాఖలో ఎన్నో ఏళ్లుగా కీలక సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని 17,000 మంది ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జనసేన పార్టీ పెద్దపల్లి,
ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ చుంచు రాజ్‌కిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చుంచు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎంలోని 78 విభాగాలకు చెందిన ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటంపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయడంతో పాటు పీఆర్సీ, డీఏ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులు తదితర ప్రయోజనాలను కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎన్హెచ్ఎం జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ గౌరీ శంకర్, తెలంగాణ రాష్ట్ర ఎన్హెచ్ఎం జేఏసీ కో-ఆర్డినేటర్ డి. వినోద్, ప్రవళిక (డీడీఎం), రాజు, మధుబాబు (పీహెచ్ఎం అడ్వైజర్), వివిధ విభాగాల ఎన్హెచ్ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





మంచిర్యాల జోన్‌లోని హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించిన ఆయన ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ సిబ్బందితో మాట్లాడి కేసుల ఆన్లైన్ నమోదు, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్ఐ కిరణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. గ్రామాల్లో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి వాటిని ఏర్పాటు చేయించేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ కుమార్, స్టేషన్ రైటర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-1 గని ఆవరణలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేయర్ ధర్ని మధుకర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, అమ్మవారి కృపతో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు శ్రీధర్, రావుల అనిల్, వెంకటేష్, ఎంబడి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
