దుర్గామాత ఆశీస్సులతో కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: మేయర్ ధర్ని మధుకర్

ఎస్ఆర్‌‌పీ-1 గని ఆవరణలో ఘనంగా చండీ హోమం

నస్పూర్, ఆర్.కె న్యూస్: జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఆకాంక్షించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్‌‌పీ-1 గని ఆవరణలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేయర్ ధర్ని మధుకర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, అమ్మవారి కృపతో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు శ్రీధర్, రావుల అనిల్, వెంకటేష్, ఎంబడి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment