ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలని శ్రీరాంపూర్ ఓసీపీ గని మేనేజర్ బి. బ్రహ్మాజీ రావు అన్నారు. గైర్హాజరు ఉద్యోగులకు సోమవారం గని గని మేనేజర్ బి. బ్రహ్మాజీ రావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఓసీపీ గని మేనేజర్ మాట్లాడుతూ అనవసరంగా విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని, విధులకు సక్రమంగా హాజరు కాకపోతే కంపెనీ సర్వీస్ నుంచి తొలగించబడుతారని అన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స తీసుకోవాలని, క్రమం తప్పకుండా అవసరమైన మందులు వాడుతూ విధులకు హాజరవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ ఓసిపి పిట్ సెక్రటరీ మోతే లచ్చన్న, సంక్షేమ అధికారి బి.శంకర్, ఉత్తమ ఉద్యోగి గొట్టేముక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలి
- ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలని, సంస్థ ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తిలో ఆర్.కె 5 గనిని సింగరేణిలో అగ్రగామిగా నిలపాలని ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ అన్నారు. సోమవారం దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఆర్.కె 5 గని ఉద్యోగులకు ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ సుమారు 30 మంది కార్మికులు విధులకు ఎందుకు గైర్హాజరు అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా విధులు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాల పై అవగాహన కల్పించారు. రెగ్యులర్ గా డ్యూటీ చేస్తూ మంచి వేతనం పొందడం ద్వారా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉండవచ్చన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సంస్థ ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉద్యోగుల గైర్హాజరు సైతం ఒక ఆటంకంగా మారింది, ఆర్.కె 5 గనిలో 1200 మందిలో కేవలం 800 మంది మాత్రమే రెగ్యులర్ గా విధులకు హాజరవుతున్నారని, 400 మంది గైర్హాజరు అవటం విచారకరమని అన్నారు. వీరిలో 125 మంది 75 మస్టర్లు కూడా చేయలేదని, వారి పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 5 గని రక్షణ అధికారి రాందాస్, సంక్షేమ అధికారి రణదీప్, అడిషనల్ మేనేజర్ శివయ్య, ఫిట్ సెక్రటరీ నర్సింగరావు, యాక్టింగ్ పీఏ శ్రీకాంత్ ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్.కె 6 కొత్త రోడ్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు వెలమ రెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి బేతి తిరుమల రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ లు ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గురు స్వాములు కొండ శ్రీను, బొడ్డు లక్ష్మణ్ అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తులు, యువకులు రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మహిళల కోసం 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి, మంచిర్యాల వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రతినిధులకు అందజేసినట్లు, రక్తదానం చేయడానికి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు రావాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి హరిప్రసాద్, ఏబిఏపి రాష్ట్ర సభ్యుడు భాస్కర్ల రాజేశం, స్థానిక అయ్యప్ప భక్తులు ఏల్పుల రవిందర్, తిరుపతి రెడ్డి, కాగితపు కుమారస్వామి, ఎలవెని రవీందర్, బామాన్ల పెళ్లి తిరుపతి, బల్లా దశరథం, పోతు మల్లయ్య, బండారు రాజేశం తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం ఎల్.వి సూర్య నారాయణ
ఆర్.కె న్యూస్, నస్పూర్: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని శ్రీరాంపూర్ జీఎం ఎల్.వి సూర్య నారాయణ అన్నారు. మందమర్రిలో జరిగిన కంపెనీ స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన శ్రీరాంపూర్ ఏరియా ఫుట్ బాల్ క్రీడాకారులను గురువారం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ఉద్యోగులను క్రీడల్లో ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తుందని, కంపెనీ స్థాయిలో జరిగిన ఫుట్ బాల్ పోటిలో గెలుపొందిన శ్రీరాంపూర్ జట్టు క్రీడాకారులు అభినందనీయులని, కోల్ ఇండియా స్థాయిలో జరిగే పోటీల్లో గెలుపొంది సింగరేణి సంస్థ పేరు నిలబెట్టాలని కోరారు. సింగరేణి ఉద్యోగులు క్రీడల్లో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, డీజీఎం (పర్సనల్) అరవింద రావు, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి, స్పోర్ట్స్ హానరరీ సెక్రటరీ పాల్ సృజన్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్. నరసయ్య, జనరల్ కెప్టెన్ ఎం. శ్రీనివాస్, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్, ఫుట్ బాల్ కెప్టెన్ బి. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో విధిగా హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి కార్యాలయ ఆవరణలో మొదటి, రెండవ షిఫ్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక గైర్హాజరు సెక్యూరిటీ గార్డుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్లు పోగుల స్వామి, రామిరెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజయ్య, జమ్మేదార్ లు బడికెల రామచందర్, దాస్, శ్రీనివాస్, కనకయ్య, నాగ మల్లేష్, ఎఫ్ఎంఎస్ సూపర్వైజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
- శ్రీరాంపూర్ జీఎం ఎల్. వెంకట సూర్య నారాయణ
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ జీఎం ఎల్. వెంకట సూర్య నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మిగిలి ఉన్న 5 నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని, ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అక్టోబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 68 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్.కె 5 గని 82 శాతం, ఆర్.కె 6 గని 96 శాతం, ఆర్.కె 7 గని 72 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 104 శాతం, ఎస్సార్పీ 1 గని 69 శాతం, ఎస్సార్పీ3 గని 80 శాతం, ఐకె 1ఎ గని 78 శాతంతో భూగర్భ గనులు 82 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 91 శాతం, ఐకె ఓసిపి 10 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 68 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఓబీ వెలికితీతలో జాప్యం కారణంగా ఐకె ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏరియాలోని ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. గత నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర, బతుకమ్మ, ఫామిలీ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో రూఫ్ టాప్ గార్డెన్, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో స్టడీ హాల్, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పలు వృత్తి శిక్షణ కోర్సులు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఐకె ఓసీపీ పీవో ఏవి రెడ్డి, డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, సీనియర్ పిఓ కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఇటీవల పదవీ విరమణ పొందిన శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘనంగా సన్మానించారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని బంగ్లా ఏరియాలో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ బి. సంజీవ రెడ్డి తన సర్వీస్ కాలంలో సింగరేణి సంస్థకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) రఘు కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ (సివిల్) శ్రీనివాస రావు, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, అన్ని గనుల మేనేజర్లు, అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గా ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జీఎం బి. సంజీవ రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందటంతో ఆర్.జి 2 జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎల్.వి సూర్యనారాయణ బదిలీపై శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చారు. ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి శ్రీనివాస్ పూల బొకె తో నూతన జీఎం ఎల్.వి సూర్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఏజెంట్లు రాముడు, శ్రీధర్, డీజీఎంలు పి. అరవింద రావు, చిరంజీవులు, ఆనంద్ కుమార్, డివైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, చంద్రలింగం, ఏరియా సర్వే అధికారి వెంకటేశం, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్క రెడ్డి, ఏరియా ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, వివిధ గనుల విభాగాల అధిపతులు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
- తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ఈ నెల 3న మిర్యాలగూడలో జరుగనున్నబిసి బహిరంగ సభను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బిసిలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ కోరారు. బహిరంగ సభ ఏర్పాట్లలో పాల్గొనేందుకు శుక్రవారం తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ఆధ్వర్యంలో టీం సభ్యులు మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల హక్కులు, రిజర్వేషన్లను కాలరాస్తూ, బిసిలను అణిచివేస్తున్న విధానాలను ఎండగడుతూ, బిసి సమాజాన్ని చైతన్యం చేస్తూ బిసిల సత్తా చాటుతున్న తీన్మార్ మల్లన్నకు మద్ధతుగా బిసి సమాజం ఉండాలని కోరారు. చరిత్రలో మిగిలి పోయే విధంగా మిర్యాలగూడ బిసి సభ జరుగుతుందని అన్నారు. సభ ఏర్పాట్లకు పాల్గొనేందుకు వెళ్లిన వారిలో తీన్మార్ మల్లన్న టీం నస్పూర్ మండల అధ్యక్షులు రాజశేఖర్, మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులు దీపక్, జన్నారం మండల అధ్యక్షులు ఎండి ఇలియాస్, నాయకులు ప్రణయ్, అశోక్, ఆసిఫాబాద్ అధ్యక్షులు ఉప్పరి నాగేష్, క్రాంతి, కడారి శ్రీనివాస్, పిప్పిరె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.