మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఈనెల 26 నుంచి కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరుగనున్న జాతీయ స్థాయి పెన్ కాక్ సిలట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మంచిర్యాల నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి కామిడి హ్రీద్య ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, క్రీడల వల్ల విద్యార్థుల మానసిక, శారీరక స్థితి అభివృద్ధి చెందుతుందని, క్రీడలతో భవిష్యత్తులో విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు.
KYATHAM RAJESH
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
- నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఓట్లు లెక్కించిన సీఐటీయూ నాయకులు
కాగజ్ నగర్, ఆర్.కె న్యూస్: ముస్లీం సోదరులు మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవ ఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకున్నారు. ఇస్లాం మతంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజునే ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారు. కాగజ్ నగర్ పట్టణంలో ముస్లీం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం ఘనంగా ర్యాలీ (జులుస్) నిర్వహించారు. ముందుగా జామియా మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ర్యాలీని మిలాద్ ఉన్ నబీ అడక్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మజీద్ ఇమామ్, కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ ర్యాలీ జామియా మజీద్ నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, లారీ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్, ఓల్డ్ కాలనీ, సర్స్కిల్ నుండి తిరిగి జామియా మజీద్ వరకు చేరుకుంది. ప్రత్యేకంగా వాహనాలను అలంకరించి భక్తిశ్రద్ధలతో ర్యాలీనిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరూ శాంతియుతంగా ఉండాలని నినాదంతో ఐకమత్యంతో కలిసి ర్యాలీ తీసే వారికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అరటి పండ్లు, మంచి నీళ్లు, లస్సి, మజ్జిక, పంపిణీ చేశారు.బీఆర్ఎస్, బీఎస్పి, కాంగ్రెస్తో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో స్వీట్లు, జ్యూస్, పండ్లు, మంచినీళ్ల బాటిళ్లు పంపిణి చేశారు. కాగజ్ నగర్ డిఎస్పి వహీద్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లీం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో ఉంటూ సేవ కార్యక్రమాలు చేపట్టడం సంతోషరమని, ప్రతీ ఒక్కరు మహ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ ల ఇమాములు, మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఘనంగా ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు
- ఘనంగా వినాయక నిమజ్జనం
- బందోబస్తు నిర్వహించిన పోలీసులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, పుడ్చ్యా వర్షి లవ్కర్ యా” (గణపతి బప్పా, వచ్చే ఏడాది త్వరగా రా) అంటూ నినాదాలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. వినాయక ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో విఘ్నాలకు అధిపతి, ప్రథమ పూజ్యుడు, ఆదిదేవుడు గణనాథునికి వీడ్కోలు పలికారు. నస్పూర్ పట్టణ పరిధిలో మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు తొమ్మిది రోజుల పాటు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద కమిటీ సభ్యులు, భక్తులు గణనాథునికి అర్చకులు సముద్రాల వెంకట రమణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తులతో వినాయక మండపం పరిసరాలల్లో సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయ వస్త్రధారణతో యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ భక్తి ప్రపత్తులతో గణనాథునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. లారీని మామిడి తోరణాలతో ముస్తాబు చేసి విఘ్నేశ్వరుడిని నిమజ్జనానికి తరలించారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ యు. ఉపేందర్ రావులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్ రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, బేర సత్యం, చిందం రాజు, ఇప్పలపల్లి రాయమల్లు, చందా శ్రీనివాస్, మండల శివ, చందా శివ, మహిళలు, చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
- ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ బోర్డు ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక గణేశ్ మండలి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణహితంగా నిర్వహిస్తున్నారు. సొసైటీ సొంత స్థలంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో తయారు చేసిన ప్రత్యేక బంక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన కుంకుమ పూజకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మొదటిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇదే స్థలంలో అందరి సలహా మేరకు ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షుడు, పర్యావరణ వేత్త, మట్టి విగ్రహ దాత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ అన్నదానం, ప్రసాద వితరణ, పూజలు, స్టీలు పళ్ళాలు, గ్లాసులు, ఆకు దొప్పలు వినియోగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గణపతి మండపం ఆవరణలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేసామని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హబీబ్, రామ్మోహన్, పొన్న మల్లయ్య, మొండయ్య, నాగేశ్వర్, శ్రీపతి బాపురావు, సలహాదారులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల 01 ప్రిన్సిపాల్ సంజీవ్, 02 ప్రిన్సిపాల్ ఆయుబ్, లక్షెట్టిపేట స్కూల్ ప్రిన్సిపాల్ అశ్వినిలు ద్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రోజుల్లో శారీరక శ్రమ లేదని, ఆటల ద్వారా దృఢంగా ఉంటారని తెలిపారు. శుక్రవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పిఈటిలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.