ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుమారుడు చరణ్ రావు, కోడలు శైలేఖ్యతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు ను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
KYATHAM RAJESH
- ఐదు అంతస్తుల కట్టడం నేలమట్టం
ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో సర్వేనెంబర్ 42 లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల అక్రమ కట్టడాన్ని గురువారం నస్పూర్ మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాజకీయ పలుకుబడితో ఓ సింగరేణి కార్మిక సంఘం నాయకుడు సర్వే నంబర్ 40 పత్రాలతో మున్సిపల్ అనుమతి తీసుకొని సర్వేనెంబర్ 42లో ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టడంతో అక్రమ కట్టడం పై మున్సిపల్ అధికారుల ఉక్కు పాదం మోపారు. బిల్డింగ్ యజమానికి మున్సిపల్ అధికారులు 2022 నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మరోసారి ముందస్తు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో రెవెన్యూ, పోలీసుల సహకారంతో జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేత కొనసాగుతున్న సమయంలో తమ బిల్డింగ్ ను ఎందుకు కూలుస్తున్నారని, కోర్టులో కేసు ఉందని పోలీసులతో వాగ్వివాదం చేశారు. అక్రమ కట్టడాన్ని అధికారులు కూలుస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ కట్టడాన్ని కూలుస్తున్న ప్రాంతానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న వార్తలు టీవీలో చూసిన జనం, ఇదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు అంటున్నారు. ఈ కూల్చివేతల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని రామ్ నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కామెర కేశవి వాషింగ్ మిషన్, కే పద్మ లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. లక్కీ డ్రా విజేతలకు ఆలయ కమిటీ సభ్యులు వాషింగ్ మిషన్, లడ్డు ప్రసాదం అందజేశారు. లక్కీ డ్రాలో బహుమతి పొందటంతో విజేతలు హర్షం వ్యక్తం చేశారు.
- ఘనంగా వినాయక నిమజ్జనం
- బందోబస్తు నిర్వహించిన పోలీసులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, వినాయక ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో ఆదిదేవుడు గణనాథునికి వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద కమిటీ సభ్యులు, భక్తులు గణనాథునికి పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తులతో వినాయక మండపం పరిసరాలల్లో సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయ వస్త్రధారణ తో యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ భక్తి ప్రపత్తులతో గణనాథునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ట్రాక్టర్ ను మామిడి తోరణాలతో ముస్తాబు చేసి విఘ్నేశ్వరుడిని నిమజ్జనానికి తరలించారు. అంత కుముందు వినాయక లడ్డును గణేష్ కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించగా, పలువురు పోటా పోటీగా వేలంలో పాల్గొని దక్కించుకున్నారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్ రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, చిందం రాజు, రాయమల్లు, రెంక రవి, చందా శ్రీనివాస్, రెంక నగేష్, రమేష్, రాజశేఖర్, నరేష్, శివ మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి యాజమాన్యం జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు పరీక్ష నిర్వహించకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారని, పరీక్ష తేదీని తెలియజేసి పరీక్ష వెంటనే నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గుండ్ల బాలాజీ, అంబాల శ్రీనివాస్ లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వెంటనే నిర్వహించి సిబ్బంది కొరత తగ్గించాలని అన్నారు. ఆఫీసు సిబ్బంది పాత కుర్చీలలో కూర్చొని నడుము, మెడ నొప్పులు వస్తున్నందున కొత్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలని, పాతకాలపు ప్రింటర్ల స్థానంలో కొత్త డిజిటల్ స్కానర్ కం ప్రింటర్లను ప్రతి సెక్షన్ లో ఏర్పాటు చేసి సీఎం పిఎఫ్ చిట్టిలను సకాలంలో ఇప్పించేలా చూడాలని, ప్రతి ఆఫీసులో క్యాబిన్లు ఏర్పాటు చేయాలని, ఆఫీసుల నిర్వహణ నిమిత్తం ఉన్న డెలిగేషన్ పవర్ ను కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని అన్నారు.
- సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు లింగం రవి
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఆదివారం నస్పూర్ పట్టణ, తాళ్లపల్లి గ్రామ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి నస్పూర్ లో, పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు షిర్కే సెంటర్ లో, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తాళ్లపల్లిలో శాఖలో జెండా ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారని, రావి నారాయణరెడ్డి సారధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గెరిల్లా రక్షక దళాలుగా ఏర్పడి 10 లక్షల ఎకరాల భూమిని పంచినట్లు, మూడువేల గ్రామాలను విముక్తి చేసినట్లు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని, బిజెపి ప్రభుత్వం మాత్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తుంది, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, మోత్కూరు కొమురయ్య, చిలుక రామచందర్, సంఘం సదానందం, కోడి వెంకటేష్, మండల నాయకులు గుడెల్లి రాజయ్య, దాడి రాజయ్య, శాఖపురం భీమరాజు, మర్రి సందీప్ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, తోట మహేష్, ముగురం రాకేష్, ఉయ్యాల శంకర్, బాలసాని లక్ష్మణ్, కంచెం పోశం, ఎండి రషీద్, గద్దె నరసయ్య, నాగపురి సమ్మయ్య, దాసరి రాజేష్, జోగుల ఆంజనేయులు, కొప్పుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ అన్నారు. ఆదివారం ఆర్.కె 6 హనుమాన్ నగర్ లోని బాల గణేష్ మండపంలో వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మండపం నిర్వాహకులు ఎస్ఐ సంతోష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగిడి రాజేష్, క్యాతం సతీష్, రమేష్, భీమయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
- టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తలారి రాజు
ఆర్.కె న్యూస్, నస్పూర్: కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తలారి రాజు, నస్పూర్ పట్టణ టీడీపీ నాయకుడు గరిగంటి రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చొక్కాలు మార్చినట్టుగా పార్టీలు మారుస్తూ బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి అతని డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో జరగబోయే పరిణామాలకు కౌశిక్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు సముద్రాల వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీలక్ష్మి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, రామగిరి బాలరాజు, క్యాతం రాజేష్, గోపతి తిరుపతి, టేకుమట్ల అంజయ్య, రెంక నగేష్, రాయమల్లు, రామ్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.