KYATHAM RAJESH
- టీజీబి సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి
- ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత పై అవగాహన
ఆర్.కె న్యూస్, నస్పూర్: సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్, కాల్స్ కు స్పందించ వద్దని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి అన్నారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని రెడ్డి కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాం పల్లి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి మాట్లాడుతూ సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్, అటల్ పెన్షన్ యోజన, పి.ఎం.జె.డి.వై జమ ఖాతా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఫోన్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, రూపే కార్డు ద్వారా యూపీఐ లావాదేవీలు, ఆధార్ అనుసంధానం చేసుకుని వేలిముద్ర వేసి కస్టమర్ సర్వీస్ పాయింట్ సెంటర్ల ద్వారా జమ, విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారు తమ పాస్ వర్డ్, పిన్ నెంబర్ రహస్యంగా ఉంచుకోవాలని, ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. టీజీబి దిశ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే జమ ఖాతాను తీసుకోవచ్చని తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి మోసపుచ్చే ప్రైవేటు వ్యక్తుల బారిన పడవద్దని, తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో దాచుకొని తమ పొదుపు మొత్తాలకు తగు వడ్డీని, అధిక భద్రతను పొందాలని కోరారు. పది రూపాయల బిల్లలు చలామణిలో ఉన్నాయని, బ్యాంకులో జమ చేయవచ్చని తెలిపారు. ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ సభ్యులు రవి, కిరణ్ కళాజాత కార్యక్రమం ద్వారా మేజిక్ షో తో బ్యాంకు పథకాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీతారాం పల్లి శాఖ క్షేత్రాధికారి రవి, మెప్మా టిఎంసి నాగరాజు, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు శ్రీదేవి, రజిత, సత్యవతి, వర్ష, లత, భాగ్య, పద్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
- సింగరేణి డైరెక్టర్ జి. వెంకటేశ్వర్ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డితో కలిసి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీరాంపూర్ ఉపరితల గని వ్యూ పాయింట్ ను సందర్శించి, క్వారీలోని పని ప్రదేశాలు, కోల్ బెంచిలను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిలువ ఉన్న బొగ్గును వీలైనంత త్వరగా వినియోగదారులకు రవాణా చేయాలని, రక్షణతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, లక్ష్య సాధనకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని, ఉపరితల గనులకు కావాల్సిన యంత్రాలు, యంత్ర సామాగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. సీఆర్ఆర్, జీవీఆర్ ఓబి కాంట్రాక్టు ప్రతినిధులు, ఉపరితల అధికారులు ఎప్పటికప్పుడు నెలవారీ లక్ష్యాలను అధిగమించాలని, రక్షణ నియమాలు పాటిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు టి. శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం ఐఈడి చిరంజీవులు, డీజీఎం పర్సనల్ పి. అరవింద రావు, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, శ్రీరాంపూర్ ఉపరితల గని మేనేజర్ బ్రహ్మాజీ, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, పర్చేజ్ అధికారి చంద్రశేఖర్, సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: అక్టోబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో గత నెల సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడానికి తగిన ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గనుల్లో యంత్రాలను 100 శాతం వినియోగించడానికి ప్రయత్నించాలని, ఉపరితల గనుల్లో ఓబి కాంట్రాక్ట్ కంపెనీ వారు నిర్దేశిత రోజువారీ లక్ష్యాన్ని సాధించాలని, అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారులు టి. శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏజెంట్లు రాముడు, శ్రీధర్, డీజీఎంలు పి. అరవింద రావు, చిరంజీవులు, మల్లయ్య, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, పర్చేజ్ ఎస్ఈ చంద్రశేఖర్, అన్ని గనుల మేనేజర్లు, రక్షణాధికారులు, అన్ని గ్రూప్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధా కుమారి తో కలిసి ప్రగతి స్టేడియంలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ డిటిపి ఉచిత వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా పలువురు మహిళలు ఉచిత వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకుని, స్వయం ఉపాధి పొందడం హర్షణీయమని అన్నారు. వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకోవడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించాలని, ఇందుకోసం ప్రతి ఒక్క మహిళ కృషి చేయాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి, తమ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి మంచి అవకాశమని అన్నారు. సేవా అధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకోవడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని, మహిళలు శిక్షణ తరగతులకు హాజరై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. నూతన కోర్సులను నేర్చుకోవడానికి మహిళలు ఆసక్తి కనబరిస్తే నూతన కోర్సులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతా రావు, సేవా సెక్రటరీ కొట్టే జ్యోతి, వృత్తి శిక్షణ కోర్సుల శిక్షకులు, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సింగరేణి ఆసుపత్రులు
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్.కె 8 డిస్పెన్సరీలో నూతన కారు షెడ్డును జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఏరియాలోని సింగరేణి ఆసుపత్రుల్లో కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సంస్థ కల్పిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలు ఏరియాలోని రెండు డిస్పెన్సరీలో అందించడం జరుగుతుందని, డిస్పెన్సరీల సేవలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, డాక్టర్లు మురళీధర్, వేద వ్యాస్, లోకనాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా నూతన ఏరియా సెక్యూరిటీ అధికారిగా జక్కా రెడ్డి సోమవారం ఎస్ అండ్ పిసి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన సెక్యూరిటీ అధికారి మురళీమోహన్ బదిలీపై భూపాలపల్లి ఏరియా కు వెళ్లారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇద్దరు సెక్యూరిటీ అధికారులను పర్మనెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ గార్డుల పాత్ర కీలకమైనదని, సింగరేణి ఆస్తుల రక్షణే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ లు పోగుల స్వామి, రామిరెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదార్ లు కనకయ్య, రామ్ చందర్, నాగ మల్లేష్, కళ్యాణ్, గుర్తింపు సంఘం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, పిట్ సెక్రటరీ ఆడెపు మల్లికార్జున్, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఖాది మేళం సింగరేణి ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నస్పూర్ కాలనీ మనోరంజన్ సముదాయంలో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ వారి ఖాదీ మేళాను ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి సేవా అధ్యక్షురాలు రాధాకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు తగ్గింపు ధరలలో ఖాదీ వస్త్రాలు అందుబాటులోకి తీసుకు రావడం సంతోషకరమైన విషయమని, సింగరేణి ఉద్యోగులు క్రెడిట్ పద్ధతిలో కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
- సింగరేణి పురోభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి
- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో వాటా చెల్లిస్తుందని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఉపరితల గనిలో నిర్వహించిన మల్టీ డిపార్టుమెంటల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర అనే కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ స్థితిగతులు ఉద్యోగులకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని అన్నారు. సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియాకు ప్రత్యేక స్థానం ఉందని, అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు సమిష్టిగా సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మంచిర్యాల జిల్లాలోని బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకే వస్తాయని, కొత్త గనులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయాని అన్నారు. త్వరలో సింగరేణిలో అపార అనుభవం కలిగి ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి సేవలు సింగరేణికి అవసరమని, రిటైర్మెంట్ అనంతరం ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిసి సంస్థ పురోభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో బొగ్గు వెలికి తీస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి రావలసిన బకాయిలను ఏక మొత్తంలో కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిచాలని, కొత్త గనులు ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, ఎస్సార్సీ ఓసీపీ పీవో టి. శ్రీనివాస్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సెంట్రల్ నర్సరీలో ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆట పాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) రవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దసరా వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆట పాట కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఇన్చార్జి డిజిఎం (పర్సనల్) రాజేశ్వర్ , పర్చేస్ శ్రీ చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.



