నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మ) నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం నస్పూర్లో ఆవిష్కరించారు. ట్రస్మ రాష్ట్ర ప్రధాన సలహాదారు, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను విడుదల చేశారు. అనంతరం తొలి ప్రతిని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణికి అందజేశారు. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి రామకృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్, ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్, నస్పూర్ మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి వూట్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
85







