- ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- జీఎం కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఉద్యోగులు సింగరేణి వ్యాప్తంగా ఉన్న సిబ్బంది అందరికీ ఆదర్శంగా నిలవాలని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం ఆయన జీఎం కార్యాలయ ప్రాంగణంలోని అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇంజనీరింగ్, ఐఈడీ, క్వాలిటీ, ఐటీ, ఫారెస్ట్, ఫైనాన్స్, ఎస్టేట్స్, సర్వే సెక్షన్లను సందర్శించారు. మొదటి అంతస్తులోని పర్సనల్, సివిల్, పర్చేస్ విభాగాల్లో ఇన్స్పెక్షన్ చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన విభాగాధిపతులతో కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏరియా పరిధిలోని గనులు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీఎం కార్యాలయ ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలని మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాల్లో పర్సనల్ విభాగం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. సివిల్, ఎస్టేట్స్, ఫైనాన్స్ వంటి అన్ని విభాగాలు తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని జీఎం సూచించారు. జీరో పెండెన్సీ లక్ష్య సాధన దిశగా అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు పాల్గొన్నారు. డీజీఎంలు రాజన్న, ఎస్. అనిల్ కుమార్, లా ఆఫీసర్ మల్లేష్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ హాజరయ్యారు.




ప్రదర్శించారు. పక్షుల కోసం ఏర్పాటు చేసిన మట్టి పాత్రలు, ఆహారమైన జొన్న గొలుసులు, ధాన్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిచ్చుకల సంరక్షణకు సంబంధించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల నగర పాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ పిచ్చుకలు ఉన్న చోట పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. పిచ్చుకలు హానికారక క్రిమి కీటకాలను తింటూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుకల రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. వేసవిలో వాటికి తాగునీరు, ఆహారం అందించాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణను శాలువాతో సన్మానించి పచ్చని మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా కార్యాలయ ఏఓ పొన్న మల్లయ్య, న్యాయవాదులు అలేఖ్య, నటేశ్వర్ పాల్గొన్నారు. పశు వైద్యాధికారి డాక్టర్ గుల్లపల్లి శంకర్ లింగం, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కిష్టయ్య, సినీ గేయ రచయిత అక్కల చంద్రమౌళి, సంస్థ సభ్యులు మహేందర్, వంశీ, స్వర్ణ, శోభ, సునీత, రాధ, శరత్ చంద్ర, రాజశేఖర్, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.