ఢిల్లీ ధర్నాకు గ్రేటర్ హైదరాబాద్ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘీభావం
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: దశాబ్దాల పాటు ప్రాణాలను పణంగా పెట్టి చీకటి గనుల్లో శ్రమించి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన బొగ్గు గని కార్మికులు నేడు వెయ్యి రూపాయల లోపు పెన్షన్‌తో ఆకలితో అలమటిస్తున్నారు” అని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్వహించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘీభావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా ఈ నిరసన చేపట్టారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంతో ఢిల్లీ వెళ్లలేకపోయిన విశ్రాంత ఉద్యోగులు ఇక్కడ ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను చాటారు.
కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 నిబంధనల ప్రకారం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి పెన్షన్ సవరించాల్సి ఉన్నా అమలు కావడం లేదని వేణు మాధవ్ విమర్శించారు. గత ఐదేళ్లుగా దిల్లీ, వారణాసి, కోల్ కత్తా, నాగ్‌పూర్, కొత్తగూడెం వంటి నగరాల్లో అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు పెరిగినా పెన్షన్ పెంచకపోవడం వల్ల విశ్రాంత కార్మికులు దారిద్ర్యంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం 300 శాతం పెరిగిన నేపథ్యంలో కరువు భత్యం లేని పెన్షన్ ఏమాత్రం సరిపోదని వివరించారు. యంత్రాలు త్రుప్పు పడితే మూలకు పడేసినట్లుగా ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగుల జీవితాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ 2025 డ్రాఫ్ట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలకు పెంచడంతో పాటు కరువు భత్యంతో కూడిన పెన్షన్ అందించాలని కోరారు. ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, వితంతువులకు ఫ్యామిలీ పెన్షన్ జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య, కె.బీరయ్య, సంయుక్త కార్యదర్శి సామంతుల నర్సింగ్ రావు, గీస కనకయ్య సహా సుమారు 50 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.




అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 15,000 రూపాయలు చెల్లించాలని కోరారు. సీపీఎంఆర్ఎస్ హెల్త్ కార్డు పరిమితిని 8 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 2017 జనవరి నుండి పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షల రూపాయలను విశ్రాంత ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
