జైపూర్, ఆర్.కె న్యూస్: జైపూర్ మండలంలోని కాన్కూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు.టీజీ ఎఫ్ డీసీ కి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలో ఉన్న వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో, ప్లాంటేషన్ లలో ఈ వేసవిలో నీటి వృధాను అరికట్టి జల సంరక్షణ చర్యలు చేపడుతూ ఈ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.








