మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్
సొన్, ఆర్.కె న్యూస్: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏవో వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సొన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వం సూచించిన సన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులు బోనస్ పొందవచ్చని వివరించారు. రైతులు నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్‌కుమార్, రైతులు రమేష్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



