అమెరికాలో ప్రమాదానికి గురైన నస్పూర్ యువతి: పెరిక సంఘం ఆర్థిక సాయం

కోమాలో ఉన్న స్పందన కుటుంబానికి రూ. 1.51 లక్షల విరాళం.. దాతలు ముందుకు రావాలని పిలుపు

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెల్లి అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన లగిశెట్టి స్పందన కుటుంబానికి పెద్దపల్లి జిల్లా పెరిక సంఘం అండగా నిలిచింది. చికాగో నగరంలో మే 31న మెట్రో స్టేషన్ పైభాగం నుంచి సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో స్పందన కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమె తల్లిదండ్రులు లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులను శనివారం సంఘం ప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, పెద్దపల్లి జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు దుండే మల్లేష్, రామగుండం కార్పొరేషన్ పెరిక సంఘం అధ్యక్షులు పోతరాజుల అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు బాధిత ఇంటికి వెళ్లారు. కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ సంఘం తరపున తక్షణ సాయంగా రూ. 1,51,216 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. కన్నబిడ్డ ప్రాణాల కోసం పోరాడుతుంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన మాటల్లో చెప్పలేనిదని, స్పందన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కందుల సంధ్యారాణి, దుండే మల్లేష్ పేర్కొన్నారు. దాతలు, సేవాభావం కలిగిన వారు కూడా ముందుకు వచ్చి ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చే చేతులే నిజమైన బంధాలని, ఒక బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు సమాజం ఏకం కావాలని పోతరాజుల అంజయ్య తెలిపారు. స్పందన ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ కుటుంబం ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకరయ్య, కార్పొరేటర్ కుమారస్వామి, సంఘం నాయకులు బత్తుల రమేష్, అక్కల నారాయణ, ఉగ్గే కుమార్, రాజు, తిప్పని రాయలింగు, కందుల శంకరయ్య, మార్త రాజేశం పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment