నస్పూర్, ఆర్.కె న్యూస్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జూలై 1న క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించబోయే “సింగరేణి పరిరక్షణ సదస్సు” గోడప్రతులను ఆర్.కె-7 గనిపై మంగళవారం విడుదల చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై కార్మికులను చైతన్యపరచడానికే ఈ సదస్సు అని, కార్మికులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న టెండల్ సూపర్వైజర్ మల్లేష్‌ను యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా సెక్రటరీలు తొంగల రమేష్, మహిపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ పాదం శ్రీనివాస్, షిఫ్ట్ సెక్రటరీ గంధం గురుమూర్తి, గని నాయకులు మల్లేష్, కృష్ణమూర్తి, రాజేందర్, కొప్పుల రవీందర్, దార వంశీకృష్ణ, రంజిత్ పటేల్, ముత్యం రాకేష్, కత్తి రాకేష్, రవి, అజిత్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30 June 2026
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె. న్యూ టెక్ గనిలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (పిట్ ఇంజనీర్) దాసరోజు రాజగోపాల చారిని మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎండీ. లాలా, బ్రాంచ్ నాయకులు వెంగల కుమారస్వామి, పిట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జ్ నవీన్ కుమార్, షిఫ్ట్ సెక్రటరీ జి. రాజు, షిఫ్ట్ ఇంచార్జ్‌లు శంకర్, అరుణ్, రాజ్ కుమార్, సంఘం కార్యకర్తలు సత్యనారాయణ, తలారి రవి, హరీష్, వహీద్, స్వామి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.



