మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ముగియాల్సిన ఈ ఆన్లైన్ దరఖాస్తుల సమయాన్ని వచ్చే ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ అప్లికేషన్లను అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని సూచించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్షను నవంబర్ 28న నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు గాను రెండు గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి సదుపాయాలు లభిస్తాయి. గడువు పొడిగింపుతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లభించినట్లయింది.
31 July 2026
సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని కడ్తాల్ గ్రామంలో శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్టన్ సెర్చ్‌లో డీఎస్పీ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, కచ్చితంగా వాహనానికి లైసెన్స్ ,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు. గంజాయి ఎవరైనా అమ్మిన, త్రాగిన పోలీసువారికి సమాచారం అదించాలని అంతేకాకుండా సైబర్ నేరాలు అయిన ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పకుండా, సైబర్ నేరాలపై అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో వాహనాల యొక్క ధ్రువపత్రాలు సరిగ్గా లేనందున 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను సీజ్ చేసి, సరి అయిన ధ్రువపత్రాలు చెక్ చేసి వదిలేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, సౌండ్ ఎస్సై కె. గోపి, లక్ష్మణ్‌చాందా ఎస్సై ఎస్.స్రవంతి, మామడ ఎస్సై హన్మాండ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



