సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని కడ్తాల్ గ్రామంలో శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్టన్ సెర్చ్‌లో డీఎస్పీ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, కచ్చితంగా వాహనానికి లైసెన్స్ ,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు. గంజాయి ఎవరైనా అమ్మిన, త్రాగిన పోలీసువారికి సమాచారం అదించాలని అంతేకాకుండా సైబర్ నేరాలు అయిన ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పకుండా, సైబర్ నేరాలపై అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో వాహనాల యొక్క ధ్రువపత్రాలు సరిగ్గా లేనందున 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను సీజ్ చేసి, సరి అయిన ధ్రువపత్రాలు చెక్ చేసి వదిలేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, సౌండ్ ఎస్సై కె. గోపి, లక్ష్మణ్‌చాందా ఎస్సై ఎస్.స్రవంతి, మామడ ఎస్సై హన్మాండ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







