సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని న్యూ బొప్పారం గ్రామానికి చెందిన పెద్దోళ్ల పెద్ద గంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బుధవారం మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట అల్లోల మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకయ్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
19 August 2026
సోన్,ఆర్.కె న్యూస్: సోన్ మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని బాల సదనంలో మానసిక వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోన్ మండల అధ్యక్షుడు అంకం సురేష్, కోశాధికారి పడిగెల నర్సయ్య, ఉపాధ్యక్షులు ఆకుల గంగాధర్, సభ్యులు అఖిల్, శేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: చేపల మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచి చేపలు విక్రయించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. సోన్ గ్రామ పంచాయతీలో మత్స్యకారుల కొరకు చేపల విక్రయానికి నిర్మించిన వర్క్ షెడ్ నిర్మాణంను డిప్యూటీ కమిషనర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ షెడ్ లోపల పరిశీలించి పరిశుభ్ర వాతావరణంలో చేపల మార్కెట్‌ను నిర్వహించాలని సూచించారు. నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.షెడ్డు నిర్మాణం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి ని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చేపల మార్కెట్ ను సోన్ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



